ఫుడ్ లైసెన్సింగ్ గురించి పూర్తిగా
రెడ్‌సీయర్ యొక్క ఒక నివేదిక ప్రకారం, 2021 నాటికి, భారతదేశంలో ఫుడ్-టెక్నాలజీ రంగం దాదాపుగా $700 మిలియన్ల ప్రస్తుత పరిమాణం నుండి కనీసం $2.5 బిలియన్లను తాకుతుందని అంచనా వేయబడుతోంది. అంటే కేవలం 3 సంవత్సరాల్లో ఇంతకు 4 రెట్లు ప్రజలు ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయబోతున్నారని దీని అర్థం.
మీరు ఒక రెస్టారెంట్ యజమాని అయినా లేదా నడుపుతున్నా, ఆన్‌లైన్ బ్యాండ్‌వాగన్ పైకి దూకడానికి ఇది మీకు అవకాశం. కానీ అప్రమత్తంగా ఉండండి - ఎందుకంటే అవకాశంలో విపరీతమైన పెరుగుదలతో, ఉల్లంఘనల కోసం రెగ్యులేటర్లు మరింత నిశితంగా గమనిస్తున్నారు.
గత నెలలోనే, లైసెన్స్ లేని ఫుడ్ ఆపరేటర్లను పట్టిక నుండి తొలగించవలసిందిగా ఎఫ్ఎస్ఎస్ఎఐ పది ప్రముఖ ఫుడ్ టెక్ ప్లాట్‌ఫార్మ్‌లను ఆదేశించింది.
దీనికి బ్యాక్‍గ్రౌండ్ ఫుడ్ లైసెన్స్ - ఇది ఎందుకు ప్రవేశపెట్టబడింది?
ఆహారం మరియు ఆహార ఉత్పత్తులతో వ్యవహరించే ఏ కంపెనీకైనా ఆహార లైసెన్స్ [ఎఫ్ఎస్ఎస్ఎఐ రిజిస్ట్రేషన్] అనేది తప్పనిసరి [మీరు మీ వ్యాపారాన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లో జాబితా చేస్తున్నా చేయకపోతున్నాగానీ]. ఎఫ్ఎస్ఎస్ఎఐ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం భారతదేశంలో ఆహారం యొక్క నాణ్యత మరియు ప్రమాణాల పై నియంత్రణను ఉంచడానికి మరియు కల్తీ తగ్గించడానికి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి, మీరు అపరిశుభ్రమైన ప్రాసెసింగ్, సరికాని పదార్థాల సేకరణ, వివిధ ఉష్ణోగ్రతలకు గురికావడం మరియు అపరిశుభ్రమైన గాలిని నివారించాలి. సహజంగానే, దాని షెల్ఫ్ జీవితానికి మించి ఏదైనా ఉత్పత్తి లేదా ఆహారాన్ని అమ్మడం మీ వ్యాపారాన్ని ఆటోమేటిగ్గా అనర్హంగా చేస్తుంది.
నేను ఒక ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్స్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? విభిన్న రకాల ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్సులు ఉన్నాయా?
ఎఫ్ఎస్ఎస్ఎఐ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఆన్‌లైన్ చేసింది. మీరు రిజిస్టర్ చేసిన తర్వాత, మీకు ఒక 14 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వబడుతుంది. కేసు మరియు వ్యాపారం యొక్క రకాన్ని బట్టి, రిజిస్ట్రేషన్ రకం భిన్నంగా ఉంటుంది.
వివిధ రకాల ఎఫ్ఎస్ఎస్ఎఐ రిజిస్ట్రేషన్ ఉన్నాయి:
1.ఎఫ్ఎస్ఎస్ఎఐ ప్రాథమిక రిజిస్ట్రేషన్:
చిన్న ఆహార తయారీదారులు, నిల్వ యూనిట్లు, రవాణాదారులు, రీటెయిలర్లు, మార్కెటర్లు, పంపిణీదారులు మొదలైనటువంటి ₹.12 లక్షల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉండే ఆహారం ఆపరేటర్లు ప్రాథమిక రిజిస్ట్రేషన్ తీసుకోవలసి ఉంటుంది. మీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ ప్రాథమిక రిజిస్ట్రేషన్ ను ఎఫ్ఎస్ఎస్ఎఐ రాష్ట్ర లైసెన్స్‌కు తర్వాత అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
2.ఎఫ్ఎస్ఎస్ఎఐ రాష్ట్ర లైసెన్స్:
₹. 20 కోట్ల వరకు [చిన్న నుండి మధ్య తరహా తయారీదారులు, పెద్ద నిల్వ యూనిట్లు లేదా మధ్యస్థ / పెద్ద రవాణాదారులు, రీటెయిలర్లు, మార్కెటర్లు లేదా పంపిణీదారులు] వార్షిక టర్నోవర్ ఉన్న ఆహార వ్యాపార ఆపరేటర్లు రాష్ట్ర లైసెన్స్ పొందాలని ఆశించబడుతోంది.
3.ఎఫ్ఎస్ఎస్ఎఐ కేంద్ర లైసెన్స్:
20 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పెద్ద ఆహార వ్యాపారాలు ఒక కేంద్ర లైసెన్స్ పొందవలసి ఉంటుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రంలో కార్యకలాపాలు ఉన్నప్పుడు లేదా మీరు ఆహారాన్ని ఇంపోర్ట్ చేసి ఎగుమతి చేయవలసినప్పుడు పైన పేర్కొన్న నియమానికి ఒక మినహాయింపు. మీకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రంలో కార్యకలాపాలు ఉంటే లేదా ఆహారాన్ని దిగుమతి/ఎగుమతి చేసుకుంటే, మీ ఆదాయంతో సంబంధం లేకుండా మీకు కేంద్ర లైసెన్స్ అవసరం.
మీరు ఎఫ్ఎస్ఎస్ఎఐ లైసెన్స్ కోసం అప్లై చేయకపోతే ఏం జరుగుతుంది?
తక్షణ పరిణామం మీరు జాబితా చేయబడి ఉన్న ఏదైనా ఫుడ్-టెక్ ప్లాట్‌ఫార్మ్ నుండి మీ వ్యాపార రిజిస్ట్రేషన్ తొలగించడం అయి ఉంటుంది.
రెండవది, మీకు ఏదైనా రకం ఆహార వ్యాపారం ఉంటే లేదా ఒకదానిలో బాధ్యతాయుతమైన హోదాలో పనిచేస్తూ ఉంటే, మీకు 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడవచ్చు మరియు ₹. 5 లక్షల వరకు జరిమానా చెల్లించేలాగా చేయబడవచ్చు. [ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 యొక్క విభాగం 31]. పరిణామాల యొక్క తీవ్రతను బట్టి చూస్తే, ప్రతి ఆహార వ్యాపారం వెంటనే తమను తాము రిజిస్టర్ చేసుకోవాలని సలహా ఇవ్వబడుతోంది. మరియు సరఫరా చేయబడే ఆహారం మీద, ముఖ్యంగా ప్యాక్ చేసిన ఆహారం మీద, దయచేసి మీ 14 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్‌ను పేర్కొనడం నిర్ధారించుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లు మరియు రిజిస్టర్ చేసుకోవడానికి మార్గదర్శకాల పై మరింత అవగాహన పొందడానికి, మీరు దీనిపై సుదీర్ఘ నివేదికను చదవవచ్చు ఎలాగ ఒక ఆహార లైసెన్స్ కోసం అప్లై చేయాలి.
మీకు సంతోషకరమైన మరియు సురక్షిత రెస్టారెంట్ నిర్వహణ కోసం శుభాకాంక్షలు!