స్టార్టప్ ఇండియా గురించి

స్టార్టప్ ఇండియా అనేది స్టార్టప్ సంస్కృతిని పెంచడానికి మరియు భారతదేశంలో ఇన్నోవేషన్ మరియు వ్యవస్థాపకత కోసం, ఒక బలమైన మరియు సమీకృత ఎకోసిస్టం నిర్మించడానికి ఉద్దేశించిన భారత ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన ఇనిషియేటివ్.

రిజిస్టర్ చేసుకోండి

స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ అంటే ఏమిటి?

16 జనవరి, 2016, లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడం, బలమైన స్టార్టప్ ఎకోసిస్టంను నిర్మించడం మరియు భారతదేశాన్ని ఉద్యోగ అన్వేషకులకు బదులుగా ఉద్యోగ సృష్టికర్తల దేశంగా మార్చడం అనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను రూపొందించింది. ఈ కార్యక్రమాలు ఒక ప్రత్యేకమైన స్టార్టప్ ఇండియా బృందం ద్వారా నిర్వహించబడతాయి, ఇది పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి (డిపిఐఐటి) నివేదిస్తుంది

 

స్టార్టఅప్ ఇండియా కార్యక్రమాల విస్తృత పరిధి దిగువ కార్యాచరణ ప్రణాళికలో వివరించబడింది.

 

స్టార్టప్ లకు మద్దతు ఇచ్చే మూలస్తంభాలు

స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద

0

సరళీకరణ మరియు చేయూత

సులభమైన సమ్మతి, రెగ్యులేటరీ మరియు పేటెంట్ మద్దతు, మార్కెట్ యాక్సెస్ మరియు ఫండింగ్ మద్దతు మరియు విజయవంతం కావడానికి స్టార్టప్‌ల కోసం నెట్‌వర్క్ మరియు యాక్సెస్ టూల్స్ కోసం ఒక వెబ్ పోర్టల్.

0

ఫండింగ్ మరియు ప్రోత్సాహకాలు

అర్హత కలిగిన స్టార్టప్‌ల కోసం ఆదాయపు పన్ను మరియు క్యాపిటల్ గెయిన్స్ పన్నుపై మినహాయింపులు; సీడ్ ఫండ్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్ మరియు స్టార్టప్ ఇకోసిస్టమ్‌లో మరింత మూలధనాన్ని ప్రవేశపెట్టడానికి క్రెడిట్ గ్యారెంటీ స్కీం.

0

ఇంక్యుబేషన్ మరియు పరిశ్రమ-అకాడెమియా భాగస్వామ్యాలు

మీ స్టార్టప్ పెరగడానికి సహాయపడటానికి ఇంక్యుబేటర్లు మరియు ఇన్నోవేషన్ ల్యాబ్స్, ఎంఎఎఆర్‌జి మెంటర్‌షిప్ కనెక్ట్, ఈవెంట్లు, పోటీలు మరియు గ్రాంట్లు.