భారతదేశంలో వ్యాపారం చేయడం

1 భారతదేశంలో ఒక కంపెనీని ప్రారంభించండి

వ్యాపార సంస్థ అన్నది లాభాలు మరియు సంపదను ఆర్జించడానికి ఉత్పత్తి మరియు/లేదా వస్తువులు, సేవల పంపిణీ చేసే ఆర్థిక సంస్థ. పరిశ్రమ మరియు వాణిజ్యంగా విభజించబడిన రెండు విభాగాల కార్యకలాపాలు ఇందులో మిళితం అయి ఉంటాయి. ప్రతీ వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని మొదలుపెట్టాలని, ఆ సంస్థను విజయవంతంగా నడపాలని లక్ష్యంగా చేసుకుంటాడు.

 

పరిశ్రమల డైరెక్టరేట్లు సంబంధిత రాష్ట్రంలో ఒక పారిశ్రామిక యూనిట్ ప్రారంభించడంలో కొత్త వ్యవస్థాపకులకు సహాయపడే మరియు మార్గనిర్దేశం చేసే వివిధ రాష్ట్రాల్లోని నోడల్ ఏజెన్సీలు. వారు పరిశ్రమ ఇన్పుట్ల కోసం పరిశ్రమ మరియు ఇతర ఏజెన్సీల మధ్య ఒక ఇంటర్ఫేస్ అందిస్తారు మరియు ఒకే పాయింట్-సింగిల్ విండోలో వివిధ విభాగాల నుండి వివిధ పారిశ్రామిక ఆమోదాలు మరియు క్లియరెన్సులను పొందడానికి వ్యవస్థాపకునికి వీలు కల్పిస్తారు.

2 వ్యాపారం కోసం ఫైనాన్సింగ్ చేయడం

వ్యాపార ఫైనాన్స్ అంటే వ్యాపారవేత్తకు తన వ్యాపార సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడం కోసం అవసరమయ్యే నిధులను మంజూరు చేయడం మరియు ఆర్థికంగా ప్రోత్సహించడం అని అర్థం. వ్యాపార చట్రంలో ప్రతీ దశలో ఇది అవసరమవుతుంది. సంస్థకు అవసరమయ్యే మూలధనం దాని వ్యాపార స్వభాగం మరియు పరిమాణంపై ఆధారపడి ఉన్నా, పరిశ్రమను (అది చిన్నదైనా, మధ్యస్థమైనదైనా లేదా పెద్దదైనా) ఏర్పాటు చేయడానికి దాని అవసరం సమాయానుగుణంగా మరియు సరిపోయే విధంగా ఉండడం అనివార్యం. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను డబ్బు మార్కెట్ మరియు మూలధన మార్కెట్‌గా విభజించవచ్చు. డబ్బు మార్కెట్ ని నియంత్రించే కార్యకలాపాలు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అత్యున్నత అధికార విభామైతే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) మూలధన మార్కెట్ నిర్వహణను పర్యవేక్షిస్తుంది.

ఒక వ్యాపారవేత్త అతను/ఆమె సంస్థ కోసం డబ్బుని పెంచే వ్యవస్థలోని ప్రధాన భాగాలు: -

ఏ) వెంచర్ క్యాపిటల్: వెంచర్ క్యాపిటల్ అనేది చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు ఫైనాన్స్ యొక్క ముఖ్యమైన వనరు, వెంచర్ క్యాపిటలిస్టులు వివిధ రంగాల ప్రొఫెషనల్స్ కలిగి ఉంటారు. ప్రాజెక్టులను పరిశీలించిన తర్వాత వారు ఈ సంస్థలకు నిధులను (వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని పిలుస్తారు) అందిస్తారు.

బి) బ్యాంకులు: బ్యాంక్ అనేది డిమాండ్ పై తిరిగి చెల్లించదగిన మరియు చెక్ ద్వారా విత్‍డ్రా చేయదగిన పబ్లిక్ నుండి డబ్బు డిపాజిట్లను అంగీకరించే ఒక సంస్థ. అటువంటి డిపాజిట్లు ఇతరులకు రుణం ఇవ్వడానికి ఉపయోగించబడతాయి మరియు తన స్వంత వ్యాపారానికి ఫైనాన్సింగ్ చేయడానికి కాదు. రుణం అందించే పదంలో రుణగ్రహీతలకు ప్రత్యక్ష రుణం మరియు ఓపెన్ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి ద్వారా పరోక్ష రుణం రెండూ ఉంటాయి. 

సి) ప్రభుత్వ స్కీములు: ఒక వ్యవస్థాపకునికి అతని/ఆమె వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాకుండా, విజయవంతమైన కార్యకలాపాలు అలాగే పారిశ్రామిక యూనిట్ యొక్క సాధారణ అప్‌గ్రేడేషన్/ఆధునీకరణ కోసం నిరంతర నిధుల ప్రవాహం అవసరం. ఈ అవసరాన్ని తీర్చడానికి, ప్రభుత్వం (కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో) బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడం; వివిధ పాలసీలు మరియు పథకాలను రూపొందించడం మొదలైనటువంటి అనేక దశలను చేపడుతోంది. అటువంటి అన్ని చర్యలు ప్రత్యేకంగా చిన్న మరియు మధ్యతరహా సంస్థల ప్రచారం మరియు అభివృద్ధి దిశగా దృష్టి పెట్టబడతాయి

డి) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు: నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సిలు) భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన విభాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇది ఒక విలక్షణమైన సంస్థల సమూహం (వాణిజ్య మరియు సహకార బ్యాంకులు కాకుండా) డిపాజిట్లను అంగీకరించడం, లోన్లు మరియు అడ్వాన్సులు చేయడం, లీజింగ్, హైర్ పర్చేజ్ మొదలైనటువంటి వివిధ మార్గాల్లో ఆర్థిక మధ్యవర్తిత్వం నిర్వహిస్తుంది. వారు ప్రజల నుండి నేరుగా లేదా పరోక్షంగా నిధులను సేకరిస్తారు మరియు వాటిని అంతిమ ఖర్చుదారులకు అప్పుగా ఇస్తారు. 

ఇ) ఆర్థిక సంస్థలు: ఆర్థిక వ్యవస్థ యొక్క వివిధ రంగాలకు తగినంత క్రెడిట్ సరఫరాను అందించడానికి భారత ప్రభుత్వం, దేశంలో ఆర్థిక సంస్థల యొక్క బాగా అభివృద్ధి చేయబడిన నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. వారి కార్యకలాపాల భౌగోళిక కవరేజ్ ఆధారంగా ఈ ఆర్థిక సంస్థలను విస్తృతంగా అఖిల భారతీయ సంస్థలు మరియు రాష్ట్ర స్థాయి సంస్థలుగా వర్గీకరించవచ్చు. జాతీయ స్థాయిలో, వారు సహేతుకమైన వడ్డీ రేట్లకు దీర్ఘకాలిక మరియు మధ్యస్థ టర్మ్ లోన్లను అందిస్తారు. 

3 వ్యాపారం కోసం చట్టపరమైన ప్రతిపాదనలు

ఏ దేశంలోనైనా చట్టపరమైన అంశాలు అన్నవి విజయవంతమైన వ్యాపార వాతావరణంలో అనివార్యమైన ఒక భాగం. విధాన నిర్మాణాన్ని మరియు ఆ దేశ ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని ఇవి ప్రతిబింభిస్తాయి. భారతదేశంలో కంపెనీకు సంబంధించి అన్ని అంశాలను నియంత్రించే అతిముఖ్యమైన చట్టం కంపెనీ చట్టం, 1956. ఇందులో కంపెనీ ఏర్పాటు, నిర్వాహకుల అధికారాలు మరియు బాధ్యతలు, నిధుల సేకరణ, కంపెనీ సమావేశాల ఏర్పాటు, కంపెనీ ఖాతాల నిర్వహణ మరియు ఆడిట్, అధికారాల తనిఖీ మరియు కంపెనీ వ్యవహారాల విచారణ, కంపెనీ యొక్క పునర్నిర్మాణం మరియు సమ్మేళనం మరియు కంపెనీ మూసివేతకు సంబంధించి కూడా నిబంధనలు ఉంటాయి.

భారత ఒప్పంద చట్టం 1872 అన్నది కంపెనీ యొక్క అన్ని లావాదేవీలను నియంత్రించే మరో చట్టం. ఒప్పందాల ఏర్పాటు మరియు అమలు, ఒప్పందం మరియు ఆఫర్ యొక్క నిబంధనల పర్యవేక్షణ, నష్టపరిహారం మరియు పూచీ, వస్తు నిక్షేపం మరియు వాగ్దానం మరు సంస్థ సహా ఇతర ఒప్పందాలకు సంబంధించి సాధారణ సూత్రాలను ఇది రూపొందిస్తుంది.

ఇతర ప్రధాన చట్టాలు కూడా ఉన్నాయి:- పరిశ్రమలు (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం 1951; ట్రేడ్ యూనియన్స్ చట్టం; కాంపిటిషన్ చట్టం, 2002;ఆర్బిట్రేషన్ మరియు సర్దుబాటు చట్టం, 1996; ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ చట్టం (FEMA),1999; మేధో సంపత్తి హక్కులతో సంబంధించిన చట్టాలు; అలాగే కార్మిక సంక్షేమకు సంబంధించిన చట్టాలు.

4 భారతదేశంలో పన్నుల వ్యాపారం


భారతదేశం ఒక మంచి అభివృద్ధి చేయబడిన పన్ను విధానాన్ని కలిగి ఉంది. పన్నులు మరియు డ్యూటీలను విధించడానికి అధికారం భారతీయ రాజ్యాంగం యొక్క నిబంధనల ప్రకారం, ప్రభుత్వం యొక్క మూడు దశలలో పంపిణీ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం విధించడానికి అధికారం గల ప్రధాన పన్నులు / డ్యూటీలు: -

a)ఆదాయపన్ను(వ్యవసాయ రాబడి మీద పన్ను తప్ప, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తాయి)

b) కస్టమ్స్ విధులు, సెంట్రల్ ఎక్సైజ్ మరియు సేల్స్ టాక్స్ మరియు

c) సేవా పన్ను

రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ప్రిన్సిపాల్ పన్నులు: -

a) అమ్మకపు పన్ను ( వస్తువుల యొక్క అంతర్ రాష్ట్ర అమ్మకంపై పన్ను),

స్టాంప్ విధి (ఆస్తి బదిలీపై డ్యూటీ),

C) రాష్ట్ర ఎక్సైజ్ (మద్యం తయారీపై డ్యూటీ),

d) భూమి ఆదాయం (వ్యవసాయ / వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించే భూమిపై లెవీ),

e) ప్రొఫెసెస్ & కాలింగ్స్ లో ఎంటర్టైన్మెంట్ అండ్ ట్యాక్స్ పై డ్యూటీ.

 

స్థానిక సంస్థలకు ట్యాక్ వసూలు చేసే అధికారం ఇవ్వబడ్డాయి: -

a) ఆస్తులపై పన్ను (భవనాలు,మొదలైనవి.),

b) సరుకుల మీద విధించే సుంకం (స్థానిక సంస్థల ప్రాంతాలలో ఉపయోగం/వినియోగానికి ఉపయోగించే వస్తువుల ప్రవేశంపై పన్ను),

C) మార్కెట్లపై పన్ను మరియు

d) వినియోగాలైన నీటి సరఫరా, పారుదల, మొదలైన వాటి కోసం పన్ను/వినియోగదారు ఛార్జీలు.

 

మరింత సమాచారం కోసం, మీరు సందర్శించవచ్చు: -

a) వ్యక్తుల పన్ను - లింక్ చేయండి

b) భాగస్వామ్యాల పన్ను - లింక్ చేయండి

c) కార్పొరేట్ల పన్ను - లింక్ చేయండి

d) ఇతర రకాల వ్యాపార సంస్థలకు పన్ను - లింక్ చేయండి

e) సర్వీస్ టాక్స్ - లింక్ చేయండి

ఎఫ్) టిడిఎస్, టిసిఎస్, టిఎఎన్ - లింక్ చేయండి