అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు, దీనిది మహిళల హక్కుల ఉద్యమంలో కీలక పాత్ర.

ఇది జాతీయ, జాతి, భాష, సాంస్కృతిక, ఆర్థిక లేదా రాజకీయ, వివిధ విభాగాలకి చెందిన మహిళలు పండుగ జరుపుకునే రోజు.

ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సవాళ్లను పరిష్కరించడానికి మహిళా సాధికారికత కేంద్ర లక్షణంగా కొనసాగుతోంది.

ఈ అందమైన సందర్భాన్ని సంబరం చేసుకోవటానికి మరియు మహిళా వ్యవస్థాపకత యొక్క స్ఫూర్తిని సంబరం చేసుకోవటానికి , ప్రారంభ దశ మహిళా స్టార్ట్అప్స్ ని మరియు ఔత్సాహిక వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి స్టార్ట్అప్ ఇండియా అనేక కార్యక్రమాలని చేపట్టింది.

 

ప్రోగ్రామ్ #1

స్టాండ్-అప్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఎంచుకున్న సంస్థల సహకారంతో, మహిళా వ్యవస్థాపకులు నేతృత్వంలో నడపబడే స్టార్ట్అప్స్ కు ఉచిత కో - వర్కింగ్ స్పేస్ను అందిస్తుంది.

ఈ ఈ స్టార్ట్అప్స్ సంస్థలు మరియు వ్యవస్థాపకుల మధ్య పరస్పర విశ్వాసం ఆధారంగా ఒక సహకార మరియు సౌకర్యవంతమైన వాతావరణంలో పని చేయగలవు.

యాభైకి పైగా ఉచిత సీట్లు మూడు నెలల కాలం కోసం అందుకోవటానికి ఉన్నాయి. స్టార్ట్అప్ ఎకో సిస్టం యొక్క ఈ క్రింది ప్రముఖ కో-వర్కింగ్ భాగస్వాములు ఈ ఉచిత కో-వర్కింగ్ అవకాశాన్ని అందిస్తున్నారు –

 

 

 

 

ప్రోగ్రామ్ #2

స్పీడ్ మెంటరింగ్

మహిళా ఔత్సాహిక వ్యవస్థాపకులకు తక్షణ మెంటర్షిప్ అందించే దిశలో, స్టార్ట్అప్ ఇండియా ఒక వేగావంతమైన మెంటరింగ్ సెషన్ను నిర్వహిస్తోంది. అనేక ప్యానెల్స్ ఏర్పాటు చేయబడతాయి మరియు ప్రతి ప్యానెల్ నలుగురు ప్రముఖ మహిళా వ్యక్తులని కలిగి ఉంటుంది:

  • ఒక పెట్టుబడిదారుడు
  • ఒక ప్రభుత్వ/పరిశ్రమ అధికారి
  • ఒక విజయవంతమైన మహిళా వ్యవస్థాపకురాలు మరియు
  • ఒక న్యాయ నిపుణుడు.

ఎంపిక చేసిన వ్యవస్థాపకులు ప్యానెల్లోని ప్రతి వాటాదారుతో 10 నిమిషాలు గడపడానికి అవకాశాన్ని అందుకుంటారు, తద్వారా ప్యానెలిస్టులతో 40 నిమిషాల ప్రత్యేకంగా మాట్లాడతారు మరియు ముఖాముఖి కలుసుకుంటారు.

ఈ ముఖాముఖి యొక్క ఉద్దేశం ఈ వ్యవస్థాపకులను వారి స్వంత నైపుణ్యాలు మరియు వ్యూహాలను అభివృద్ధి చేసుకొనేలా చేయటం మరియు వారి ఆలోచనలను తదుపరి స్థాయికి తీసువెళ్ళగలిగేలా చేయటం.

ఇది కేవలం ఆహ్వానించబడిన వారికి మాత్రమే ప్రత్యేకించిన కార్యక్రమం

 

 

మీ మార్గదర్శకులను కలవండి

భారతదేశంలో మహిళా వ్యవస్థాపకులు