నేను, డాక్టర్ వనితా ప్రసాద్, రెవీ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క వ్యవస్థాపకురాలిని. సవాళ్లను విశ్లేషించడం మరియు వినూత్న పరిష్కారాలను కనుగొనడం పైనే నా పరిశోధన సాగేది. అయితే, వనరులు మరియు ఫండ్స్ లేకపోవడం వలన, నేను నా ఆలోచనలు చాలా కాలం పాటు కార్యరూపం దాల్చలేదు. స్టార్ట్-అప్లకు మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకున్న తరువాత, వ్యవస్థాపకత ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను ప్రేరణ పొందాను.

ఈ ప్రయాణంలో, స్టార్ట్-అప్ ఇండియా మరియు ఇన్వెస్ట్ ఇండియా ద్వారా మేము చేయూతని మరియు గుర్తింపుని పొందాము. స్టార్ట్-అప్ ఇండియా ద్వారా నిర్వహించబడిన ఇండో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో 'లో ఎనర్జీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫార్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్' విభాగంలో మేము విజేతలుగా నిలిచాము, ఇది మా లక్ష్యం సాధించడానికి ఎంతో ప్రేరణ కలిగించింది. ఈ సహకారంతో నేను ఇజ్రాయెల్ సందర్శించి అక్కడి వ్యర్థ నీటి నిర్వహణ సదుపాయాలు మరియు మేము పరిశోధన చేస్తున్న అంశం పై ఇజ్రాయెల్ కంపెనీలతో సాంకేతిక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగింది.
ఇంకా, ఈ ప్రయాణంలో, స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, భారతదేశంలోని తాజా నీటి వనరులను కలుషితం చేసే బయోడీగ్రేడబుల్ వ్యర్థాలు, సీవేజ్ మరియు పారిశ్రామిక వ్యర్థాలు ట్రీట్మెంట్ పై కూడా మేము దృష్టి కేంద్రీకరించాము. మా ఈ ప్రయత్నం స్వచ్ఛతా పఖ్వాడ ఆధ్వర్యంలో వేస్ట్ మానేజ్మెంట్ విభాగంలో స్టార్టప్ ఇండియా నిర్వహించిన 'స్వచ్ఛ భారత్ గ్రాండ్ ఛాలెంజ్' గెలవడానికి దోహదపడింది.

ఇంకా, దేశంలో వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా భారతదేశంలో నిర్మించబడిన అత్యంత సమగ్రమైన స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ నుండి మద్దతుతో, ఇన్వెస్ట్ ఇండియా యొక్క ఇన్నోవేట్ చేయడానికి (i2i) ప్రోగ్రామ్ మాకు ఎక్సాన్ మొబిల్తో కనెక్ట్ అవడానికి సహాయపడింది. ఈ ప్రత్యేక సహకారం ఉత్పత్తి చేయబడిన నీటిని ట్రీట్ చేయడానికి పెరుగుతున్న అవసరాన్ని పరిష్కరించడంతో పాటుగా ప్రతిపాదనను కమర్షియలైజ్ చేయడం, దాని పోటీతత్వ స్థానాన్ని మెరుగుపరచడం మరియు అధిక రెవెన్యూని జనరేట్ చేయడం.
అలాగే, డిపిఐఐటి గుర్తింపు లభించడం మరియు ఇప్పుడు పన్ను ప్రయోజనాలకు యాక్సెస్, సులభమైన సమ్మతి, ఐపిఆర్ యొక్క ఫాస్ట్-ట్రాకింగ్ వలన మేము వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు వేగంగా విస్తరించగలిగాము. ప్రస్తుతం, మేము మా కార్యకలాపాలను గుజరాత్ అంతటా విస్తరిస్తున్నాము మరియు వాటిని జాతీయ స్థాయిలో పరిష్కారాలను అందించే విధంగా అభివృద్ధి చేస్తున్నాము. ఆవిష్కరణ కోసం ప్రయత్నించడం మరియు మా కస్టమర్లకు ఆర్థికంగా సాధ్యమయ్యే, పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన పరిష్కారాన్ని అందించడమే మా విజన్.

మా వ్యవస్థాపకత ప్రయాణంలో మాకు మద్దతు ఇచ్చి, మార్గనిర్దేశకం చేసి ప్రోత్సహించిన స్టార్ట్-అప్ ఇండియాకి ధన్యవాదములు!!”
డాక్టర్ వనితా ప్రసాద్, ఫౌండర్ & డైరెక్టర్
రెవీ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ ప్రైవేట్. లిమిటెడ్.