యాక్షన్ ప్లాన్ & స్టేటస్ రిపోర్ట్
స్టార్టప్ ఇండియా అనేది భారతదేశ ప్రభుత్వం ఆరంభించిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇది కొత్త ఆలోచనలను మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించి తద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలిపించడం కోసం ఉద్దేశించబడినది. ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణలు మరియు డిజైన్ ద్వారా స్టార్టప్‌లు వృద్ధి చెందేందుకు వాటికి తోడ్పాటు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.
కార్యక్రమం యొక్క లక్ష్యాలను అందిపుచ్చుకునేందుకు, 16 జనవరి, 2016న భారతదేశ ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క అన్ని అంశాలను పరిష్కరించే ఒక యాక్షన్ ప్లాన్ ని ప్రకటించింది. ఈ యాక్షన్ ప్లాన్ సహాయంతో, స్టార్టప్ ఉద్యమం వ్యాప్తిని వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. యాక్షన్ ప్లాన్ క్రింది మూడు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది:
- సరళీకరణ మరియు చేయూత
- ఫండింగ్ మద్దతు మరియు ప్రోత్సాహకాలు
- ఇండస్ట్రీ-ఎకడెమియా పార్ట్నర్షిప్ మరియు ఇన్క్యుబేషన్
